'నాసా స్పేస్ సెటిల్మెంట్ కంటెస్టెంట్ 2021' లో శ్రీచైతన్య పాఠశాలల నుంచి 64 ప్రాజెక్టులు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని కూకట్పల్లి జోన్ చైతన్య పాఠశాల రీజనల్ ఇంఛార్జ్ అనిత అన్నారు. కూకట్పల్లి నుంచి ఇద్దరు విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయి. వారిని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరాలని వారు ఆకాంక్షించారు.
మొత్తం 35 దేశాలు ఈ పోటీల్లో పాల్గొనగా.. నాసా 160 ప్రాజెక్టులు ఎంపిక చేసింది. 107 ప్రాజెక్టుల ఎంపికతో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. భారత్లో ఎంపికైన మొత్తం 107 ప్రాజెక్టుల్లో శ్రీచైతన్య విద్యార్థులవి 64 ప్రాజెక్టులు ఉండటం విశేషం.