విద్యార్థుల ప్రతిభకు కొలమానం లేదని శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మా బొప్పన అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ్ బంగా, హరియాణా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 390 శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన 1,32,121 మంది విద్యార్థులు స్పోర్ట్స్ డ్రిల్తో పాటు యోగా విన్యాసాలను వేర్వేరు వేదికల్లో ఒకే సమయంలో ప్రదర్శించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ దేశాలకు చెందిన ఎలైట్ ప్రపంచ రికార్డు సంస్థల సీఈఓలు రాబిన్ బల్ బాకీ, ఆనుప్ జాయ్, అహ్మద్ షబ్రి అబెదలిహలిమ్ సల్మా, ఏషియన్ రికార్డ్ అకాడమీ సీఈవో ఆదిల్ మౌనిర్ రయాద్ ఘటాస్, ఏషియన్ ఇండియా రికార్డ్స్ అకాడమీ అసోసియేట్ ఎడిటర్ పీ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుష్మా బొప్పనకు ప్రపంచ రికార్డును అందజేశారు.