తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ముగ్గురు శ్రావణిని పెళ్లి పేరుతో మోసగించారు: డీసీపీ - sravni-suicide-case-two-accused-arrested-at-sr-nagar-police-station

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఎన్నో మలుపుల తర్వాత ఎట్టకేలకు పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. సాయికృష్ణా రెడ్డి, దేవరాజ్​లను అరెస్ట్‌ చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ ఎ.ఆర్​ శ్రీనివాస్​ వెల్లడించారు. పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Two persons arrested in actress Sravani suicide case
ఆ ముగ్గురు పెళ్లి పేరుతో మోసం చేశారు: డీసీపీ

By

Published : Sep 14, 2020, 6:14 PM IST

Updated : Sep 14, 2020, 8:17 PM IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ముగ్గురిని నిందితులుగా గుర్తించామని పశ్చిమ మండల డీసీపీ ఎ.ఆర్​ శ్రీనివాస్​ తెలిపారు. ఏ1 సాయికృష్టారెడ్డి, ఏ2 ఆశోక్​రెడ్డి, ఏ3 దేవరాజ్‌రెడ్డిగా గుర్తించినట్లు వెల్లడించారు. సాయికృష్ణా రెడ్డి, దేవరాజ్‌రెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ ముగ్గురు నిందితులు ఏదో ఒక సందర్భంలో యువతిని పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడానికి కుదరదని డీసీపీ తెలిపారు.

ఎనిమిదేళ్ల క్రితం నటన మీద ఆసక్తితో కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చిన శ్రావణికి 2015లో సాయికృష్ణా రెడ్డితో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా సినీ నిర్మాత అశోక్ రెడ్డి కలిశాడు. ఇద్దరితోనూ సన్నిహితంగా మెలుగుతున్న సమయంలోనే టిక్​టాక్ ద్వారా దేవరాజ్​రెడ్డి పరిచయమయ్యాడు. అతనితో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దేవారాజ్, శ్రావణి సన్నిహితంగా మెలగడాన్ని జీర్ణించుకోలేని సాయికృష్ణా రెడ్డి, అశోక్ రెడ్డి కలిసి ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. శ్రావణి తల్లిదండ్రులకు దేవారాజ్ విషయం చెప్పి ఆమెను తిట్టించారు. ఈ తరుణంలో మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. -ఎ.ఆర్‌.శ్రీనివాస్, పశ్చిమ మండల డీసీపీ

ఆ ముగ్గురు పెళ్లి పేరుతో మోసం చేశారు: డీసీపీ ఎ.ఆర్​ శ్రీనివాస్

ఇదీ చూడండి:శ్రావణి కేసు: కాసేపట్లో కోర్టు ముందుకు సాయిరెడ్డి, దేవరాజ్

Last Updated : Sep 14, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details