ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పపడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువ చేసే 130 గ్రామలు బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన ఆనంద్ కుమార్, నాగ భాస్కర్‌గా గుర్తించారు. వీరిద్దరిపై పాతకేసులు కూడా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా చైన్ స్నాచింగ్, బైకు దొంగతనాలు చేసే సతీష్, ప్రవీణ్ కుమార్‌లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక చరవాణి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ సీఐ అజయ్ కుమార్ ఎంతో చాకచక్యంగా చోరులను పట్టుకున్నారని ఏసీపీ తిరుపతి అభినందించారు.
నలుగురు దొంగల అరెస్ట్ - SR NAGAR
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనాలు చేసే నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు దొంగల అరెస్ట్