తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2020, 3:29 PM IST

ETV Bharat / state

కరోనా విపత్కర కాలంలో... పోలీసుల ఔదార్యం

లాక్​డౌన్​ వల్ల భాగ్యనగరంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ఎస్​ఆర్​నగర్​ పోలీసులు ముందుకు వచ్చారు. వారి ఆకలి తీర్చడానికి నిత్యావసర సరుకులు అందించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

sr nagar police distributed groceries in Hyderabad to construction workers
భవన నిర్మాణ కార్మికులకు సరుకుల పంపిణీ

కరోనా ప్రభావంతో రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన భవన నిర్మాణ కూలీలు భాగ్యనగరంలోనే చిక్కుకుపోయారు. వారి బాగోగులు చూసుకోవాల్సిన కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం వల్ల ఎస్ ఆర్​నగర్ పోలీసులు వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు.

ఎస్​ఆర్​ నగర్ పీఎస్ పరిధిలోని పోలీసులంతా కలిసి 150 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారి ఆకలి తీర్చడానికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

భవన నిర్మాణానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను పిలిపించుకుని, ఆపత్కర సమయంలో వారి బాధలు గాలికొదిలేసిన కాంట్రాక్టర్​పై కేసు నమోదు చేస్తామని ఇన్​స్పెక్టర్ సాయినాథ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details