కొవిడ్-19 వైరస్ విస్త్రృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల రసాయనాలు చల్లుతున్నారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్ పరిసరాల్లో భారీగా రసాయనాలను చల్లారు. అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగానే రసాయనాలను పిచికారీ చేసినట్లు సచివాలయ అధికారులు స్పష్టం చేశారు.
బీఆర్కే భవన్లో రసాయనాల పిచికారీ - Brk Bhavan Spraying
హైదరాబాద్ హిమాయత్ నగర్ పరిధిలో ఉన్న సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బూర్గుల రామకృష్ణారావు భవన్లో రసాయనాలు పిచికారీ చేశారు.
![బీఆర్కే భవన్లో రసాయనాల పిచికారీ 'ముందు జాగ్రత్త చర్యగానే పిచికారీ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6871129-thumbnail-3x2-brk.jpg)
'ముందు జాగ్రత్త చర్యగానే పిచికారీ'