సికింద్రాబాద్ రెండవ దశ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మార్కెట్ యార్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే - సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే
బోయిన్పల్లి మార్కెట్ యార్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
![మార్కెట్ యార్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే Spray sodium hypochloride solution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:01:07:1619076667-vlcsnap-2021-04-22-12h36m24s940-2204newsroom-1619075214-272.jpg)
Spray sodium hypochloride solution
బోయిన్పల్లి మార్కెట్కు ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే రైతులు, హమాలీల ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. తన సొంత నిధులతో క్రిమి సంహారక యంత్రాన్ని తీసుకుని మార్కెట్లోని ప్రతి దుకాణం వద్ద పిచికారీ చేయించారు. మార్కెట్కు వచ్చే రైతులతో పాటు దుకాణదారులు కూడా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.