సికింద్రాబాద్ సింది కాలనీ, రాంగోపాల్ పేట్, రాణిగంజ్ ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో తాము శానిటైజ్ చేస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు తెలిపారు.
డీజీపీ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో స్ప్రే
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కట్టడి చర్యలను మరింత ముమ్మరం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రసాయనిక ద్రావణాలను రోడ్లపై పిచికారీ చేస్తున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో స్ప్రే చేస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
డీజీపీ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో స్ప్రే
ప్రధానంగా కంటైన్మెంట్ ప్రాంతాల్లో పిచికారీ చేస్తూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరచడం మూలంగా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ ప్రాంతంలో రోడ్లపై, బస్టాప్, రైల్వే స్టేషన్, రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ చల్లారు. ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :పోలీసులకు హారతులు..పూలవర్షం