తెలంగాణ

telangana

ETV Bharat / state

24, 25 తేదీల్లో ఆ​ కోర్సులకు స్పాట్​ అడ్మిషన్లు - Educational information Details

ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్​ మేనేజ్​మెంట్​ కోర్సులకు సంబంధించి స్పాట్​ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థులు హాజరు కావాలని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్​ ఆఫ్​ ఇండియా డైరెక్టర్ రామేశ్వర రావు సూచించారు.

ఆ​ కోర్సులకు స్పాట్​ అడ్మిషన్లు ప్రారంభం
24, 25 తేదీల్లో ఆ​ కోర్సులకు స్పాట్​ అడ్మిషన్లు

By

Published : Jan 22, 2021, 6:54 PM IST

పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్​ మేనేజ్​మెంట్​ కోర్సులకు సంబంధించి స్పాట్​ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్​ ఆఫ్​ ఇండియా డైరెక్టర్ రామేశ్వర రావు తెలిపారు.

ఈనెల 24, 25 తేదీల్లో ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో నిర్వహించే అడ్మిషన్లకు... డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు హాజరు కావాలని సూచించారు. అదే విధంగా ఏ కోర్సులో చేరితే అవకాశాలు ఉంటాయో అనే విషయాలతో పాటు.. విద్యార్థుల్లో సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. 2020-21 ఏడాదికి ఈ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో పీజీడీఎం జనరల్​, పీజీడీఎం ఇన్​ఫ్రా స్ట్రక్చర్​ కోర్సులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోర్సులకు మంచి డిమాండ్​ ఉందని వివరించారు. కోర్సు పూర్తి చేసిన వెంటనే జాబ్​ గ్యారెంటీ అని పేర్కొన్నారు. రూ. 3.5 లక్షలతో రెండేళ్లలో కోర్సు పూర్తి చేసుకోవచ్చని సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతోపాటు చక్కటి వసతి గృహ సౌకర్యం ఉందని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details