తెలంగాణ

telangana

ETV Bharat / state

'పీపీపీ పద్ధతిలో టెన్​పిన్​ బౌలింగ్​ క్రీడ అభివృద్ధి' - టెన్​పిన్​ బౌలింగ్​ అసోషియేషన్​

అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టెన్​పిన్​ బౌలింగ్​ క్రీడను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. హైదరాబాద్​ పార్క్​హయత్​లో టెన్​పిన్​ బౌలింగ్​ అసోషియేషన్​ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు.

క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​

By

Published : Jul 10, 2019, 5:05 PM IST

పీపీపీ పద్ధతిలో టెన్‌పిన్‌ బౌలింగ్‌ క్రీడను అభివృద్ధి పరుచుకుందామని క్రీడాశాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్​ పార్క్​హయత్​లో టెన్​పిన్​ బౌలింగ్​ అసోషియేషన్​ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై... తెలంగాణ విభాగాన్ని ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. పని ఒత్తిడికి లోనయ్యే సాఫ్ట్​వేర్​ ఉద్యోగులకు ఈ ఆట ఉపయోగకరమని తెలిపారు. ప్రముఖ నగరాల్లో ఇలాంటి క్రీడను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సరదాగా టెన్​పిన్​ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు మంత్రి.

టెన్​పిన్​ బౌలింగ్​ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామన్న శ్రీనివాస్​గౌడ్​

ABOUT THE AUTHOR

...view details