తెలంగాణ

telangana

ETV Bharat / state

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం ఇకనుంచి నిషేధం. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Spitting in public places is prohibited in telangana
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం

By

Published : Apr 9, 2020, 8:10 AM IST

కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై పాన్‌, తంబాకు ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రబలుతోంది. ఈ సమయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి.

అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. వాటి వల్ల వైరస్‌, ఇన్‌ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల ఇన్‌ఫెక్షన్లు మరింత వ్యాప్తి చెందుతాయి. ప్రజారోగ్యం భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్‌, పొగాకు, పొగాకేతర ఉత్పత్తులు నమిలి ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి :పోలీసుల కోసం.. ఓ కుటుంబం 10 లక్షల విరాళం

ABOUT THE AUTHOR

...view details