స్పైస్ జెట్ విమాన సంస్థ లాక్డౌన్ తరుణంలోనూ తన సేవలందిస్తోంది. లాక్డౌన్ విధించినప్పటి నుంచి 885 కార్గో విమానాలను నడపడమే గాక... 6384 టన్నుల వస్తువులను గమ్యస్థానాలకు చేరవేసింది. మిగతా అన్ని విమాన సంస్థలు సరఫరా చేసిన సరుకుల కంటే స్పైస్ జెట్ రెట్టింపు సంఖ్యలో రవాణా చేసింది. శనివారం సైతం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 18 టన్నుల అత్యవసర ఔషధాలను తీసుకెళ్లారు. అదే విధంగా 321 కార్గో విమానాలు విదేశాలకు సరుకు రవాణా చేశాయి.
లాక్డౌన్లోనూ స్పైస్ జెట్ విస్తృత సేవలు - spice jet services lockdown
లాక్డౌన్ సమయంలోనూ స్పైస్ జెట్ విమాన సంస్థ చేదోడు వాదోడుగా నిలుస్తోంది. కార్గో విమానాలను నడిపిస్తూ కరోనా నివారణకు సంబంధించిన ఔషధాలను దేశంలోని పలు ప్రాంతాలకు ఆగమేఘాల మీద చేరవేస్తోంది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి నేటి వరకు 885 కార్గో విమానాలను నడిపించింది.
![లాక్డౌన్లోనూ స్పైస్ జెట్ విస్తృత సేవలు స్పైస్ జెట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7132461-285-7132461-1589037103554.jpg)
స్పైస్ జెట్
రవాణాలో అంతరాయం తలెత్తకుండా... ప్రయాణికుల విమానాలను సైతం కార్గో కోసం ఉపయోగిస్తోంది. కరోనా కట్టడికి కోసం ఉపయోగిస్తున్న శానిటైజర్లు, ఫేస్ మాస్క్, రాపిడ్ టెస్క్ కిట్లు, థర్మోమీటర్లను స్పైస్ ఎక్స్ప్రెస్ విమానాలతో వేగంగా రవాణా చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతికి సైతం స్పైస్ జెట్ దోహదపడుతోంది. మార్చి 29వ తేదీన ఇరాన్ నుంచి తీసుకొచ్చిన 136 మంది ప్రయాణికులు దిల్లీ నుంచి జోధ్పూర్ క్వారంటైన్ కేంద్రానికి స్పైస్ జెట్ విమానంలోనే తరలించారు.