Election Campaigners Demand in Telangana : 'మా పనిమనిషి నాలుగు రోజులుగా రావడం లేదు. మా వాచ్‌మన్ వాళ్లు వారం రోజుల కిందటే ఊరికి వెళ్లారు. అవునండి మా ఇంట్లో పని చేసే మనిషి కూడా పది రోజులుగా సరిగ్గా రావడం లేదు..' నగరాల్లో, పట్టణాల్లోని పలు బహుళ అంతస్తులు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రస్తుతం ఇదే ముచ్చట నడుస్తోంది. అభ్యర్థుల వెంటప్రచారానికితిరిగే వారికి అధిక డబ్బులు ఇస్తుండటంతో పని మనుషులు అటువైవు వరుస కడుతున్నారు. అంతేకాదు.. ఒక గ్రూప్‌గా ఏర్పడి మరీ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం చేసి వస్తున్నారు.
ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంతా - నీ లీడర్ ఇచ్చే చీప్‌లిక్కర్ రేటంతేనా?
రాష్ట్రంలో పార్టీల ఎన్నికల (Telangana Elections 2023) ప్రచారం తారస్థాయికి చేరింది. వివిధ పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి ప్రచారం చేయడానికి వరుస కడుతున్నారు. రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. దీంతో నగరాలు, పట్టణాలలో ప్రచారానికి అభ్యర్థులకు కార్యకర్తలు దొరకడం లేదు. ఈ క్రమంలో ఇళ్లలో పనులు చేసే వారిని ప్రచారానికి తీసుకువెళుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారి వెంట వీరూ ప్రచారానికి సై అంటున్నారు. నెలంతా చేసే పనికి వచ్చే డబ్బులు.. నాలుగైదు రోజుల్లోనే వస్తున్నాయి కాబట్టి..ప్రచారం ముగిసేదాక మీరే ఎలాగైనా సర్దుకోండని కొందరు తమ యజమానులను బతిమిలాడుతున్నారు. కొందరైతే ఈ పని కాకపోతే మరోకటి దొరకదా అంటూ పని మానేసి.. ప్రచారానికి వెళ్తున్నారు.
ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం