రాష్ట్రంలో జులై ఒకటి నుంచి కళాశాలలు, పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... పలు యాజమాన్యాలు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం...హైదరాబాద్ అబిడ్స్ మేథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ రెండు రోజులపాటు వ్యాక్సినేషన్(Covid Vaccination) డ్రైవ్‌ను నిర్వహించింది.
Covid Vaccination: కళాశాలలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
రాష్ట్రంలో జులై మొదటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు మొదలు కానున్న తరుణంలో పలు కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా అబిడ్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్(Covid Vaccination) డ్రైవ్ చేపట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం అబిడ్స్ మేథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో రెండు రోజులపాటు కొవిడ్ టీకా కార్యక్రమం నిర్వహించారు.
Covid Vaccination: కళాశాలలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
అబిడ్స్‌లోని కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొని టీకా వేయించుకున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... కళాశాలలోనే రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారావు తెలిపారు. ఈ డ్రైవ్‌లో విద్యార్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి:YS Sharmila: షర్మిలకు అభిమానులు ఘన స్వాగతం