దసరా పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. భువనగిరి, ఆలేరు, జనగాం, స్టేషన్ ఘన్పూర్, కాజీపేట్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, గోదావరిఖని, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలో ఆగుతుందని రైల్వేశాఖ పేర్కొంది.
పండుగ వేళ సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైళ్లు - సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైళ్లు
దసరా పండగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల సంఖ్యను మరింత పెంచుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తాజాగా సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఈ నెల 23 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించింది.
![పండుగ వేళ సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైళ్లు special trains running between secunderabad and sirpur kagajnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9278382-841-9278382-1603403216124.jpg)
పండగ వేళ సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:40కి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చేరుకుంటుందన్నారు. అదేరోజు మధ్యాహ్నం సిర్పూర్ కాగజ్‌నగర్‌లో 2:45కు బయలుదేరి తిరిగి సికింద్రాబాదుకు రాత్రి 8గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు కాచిగూడ-నెక్లార్, కాచిగూడ-ఆకోలా, నాందేడ్-పన్వేల్, ధర్మాబాద్-మన్మాడ్, హైదరాబాద్-ఔరంగాబాదుకు ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.