తెలంగాణ

telangana

ETV Bharat / state

యూపీఎస్సీ పరీక్ష కోసం ప్రత్యేక రైళ్లు - యూపీఎస్సీ ప్రత్యేక రైళ్లు

అసలే కరోనా కాలం.. అందులోనూ యూపీఎస్సీ పరీక్షలు.. బస్సులు, రైళ్లులేవే అని ఆందోళన చెందుతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు వెల్లడించింది.

special trains for upsc exams
యూపీఎస్సీ పరీక్ష కోసం ప్రత్యేక రైళ్లు

By

Published : Sep 29, 2020, 7:46 PM IST

యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్ 3,4వ తేదీల్లో విజయవాడ -విశాఖపట్నం- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొనింది. ఈ ప్రత్యేక రైళ్లు తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని ఎస్‌సీఆర్ వివరించింది.

ABOUT THE AUTHOR

...view details