తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవి రద్దీ కోసం 624 ప్రత్యేక రైళ్లు

వేసవికాలం వచ్చేసింది. విద్యార్థులకు మరికొద్ది రోజుల్లో పరీక్షలు పూర్తవుతున్నాయి. సెలవుల్లో ఏ విహారయాత్రో, అమ్మమ్మ వాళ్లింటికో వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటారు. సహజంగానే రైలు ప్రయాణం సౌకర్యమని వాటికే మొగ్గుచూపుతారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 624 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది ఆ శాఖ.

By

Published : Mar 18, 2019, 2:11 PM IST

వేసవి రద్దీ కోసం 624 ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ కోసం 624 ప్రత్యేక రైళ్లు
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 624 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఏప్రిల్​లో 211, మేలో 212, జూన్​లో 201 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుపతి, నాందేడ్, విజయవాడ, నాగర్​సోల్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రదేశాలకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ. వీటితో పాటు రాయచూర్, కృష్ణరాజపురం, కాకినాడ, విశాఖపట్నం, పూణే వంటి పట్టణాలకు కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది. బరౌని, రక్ సాల్, దర్భంగా, జయపుర, టాటానగర్ వంటి దూర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల మీదుగా వెళ్తాయి.

ప్రత్యేక కోచ్​లతో పాటు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ఏసీ తరగతులకు డిమాండ్ ఎక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధారణ ఇంటర్ సిటీ రైళ్లకు అదనపు ఏసీ ఛైర్ కోచ్​లను జతచేసేందుకు రైల్వే శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఆన్​లైన్ సేవలను వినియోగించుకుంటే...రైల్వేస్టేషన్ వరకు వెళ్లి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రత్యేక రైళ్లకు సాధారణ టికెట్ ధరలనే నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. రద్దీకి అనుగుణంగా మరిన్నీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details