సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను జతచేసినట్లు రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి రాకేశ్ తెలిపారు. విశాఖపట్టణం- సికింద్రాబాద్ మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లు విశాఖపట్టణం- సికింద్రాబాద్, విశాఖపట్టణం- తిరుపతి, భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య నడుస్తాయని తెలిపారు. విశాఖపట్టణం- సికింద్రాబాద్ మధ్య 26 రైళ్లు నడిపించనున్నట్లు చెప్పారు. జనవరి 7, 14, 21, 28 తేదీల్లో, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయని వివరించారు.
విశాఖపట్టణం- తిరుపతి మధ్య 26 ప్రత్యేక సర్వీసులను జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపుతామని పేర్కొన్నారు. భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య 25 రైళ్లను జనవరిలో 2, 9, 16, 23, 30 తేదీల్లో.. ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో.. మార్చి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుందని చెప్పారు. సికింద్రాబాద్- భువనేశ్వర్ మధ్య ఒక సువిధ ఎక్స్ప్రెస్ రైలును జనవరి 10న ఉంటుందని వివరించారు.