వలస కూలీల తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇంతకు ముందు రోజుకు రెండు నుంచి మూడు రైళ్లలో వలసకూలీలను శ్రామిక్ రైళ్లలో తరలించగా... శనివారం మాత్రం సుమారు 35కు పైగా రైళ్లలో వలస కూలీలను వారివారి స్వస్థలాలకు తరలించారు.
మొదట థర్మల్ స్క్రీనింగ్...
ఇప్పటి వరకు.. నగర శివారు రైల్వే స్టేషన్ల నుంచే శ్రామిక్ రైళ్లు బయల్దేరగా... శనివారం తొలిసారిగా ప్రధాన రైల్వే స్టేషన్లయిన సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల వలస కార్మికులను తరలించారు. వలస కూలీలు ఉండే ప్రాంతాల నుంచి... బస్సులు, డీసీఎంవ్యాన్లలో అధికారులు రైల్వేస్టేషన్లకు తీసుకువచ్చారు. అనంతరం థర్మల్ స్క్రీనింగ్ చేసి స్టేషన్ లోపలికి పంపుతున్నారు.