తెలంగాణ

telangana

ETV Bharat / state

దెబ్బతిన్న రహదారులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు - Roads damaged due to rains

వర్షాలతో దెబ్బతిన్న రహదారులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. 99 ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

దెబ్బతిన్న రహదారులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు
దెబ్బతిన్న రహదారులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు

By

Published : Aug 19, 2020, 10:23 AM IST

ఎడతెరిపిలేని వర్షాలతో దెబ్బతిన్న రహదారులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. 99 ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాటిలో 77 ప్రాంతాల్లో పనులు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దామని అధికారులు పేర్కొన్నారు.

మరో 22 ప్రాంతాల్లో మరమ్మత్తులు చేయిస్తున్నామన్నారు. కిన్నెరసాని, ఖమ్మం - కురవి, శ్రీశైలం హైవే, భూపాలపల్లి - ఆత్మకూరు మార్గంలోని చాలివాగు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు చేసి పునరుద్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details