తెలంగాణ

telangana

ETV Bharat / state

23 ఏళ్లుగా 'ఇంకుడుగుంత'ల యజ్ఞం.. 10 వేలకు పైగా నిర్మాణాల్లో భాగస్వామ్యం! - water harvesting story

నీరు ఎంతో అమూల్యమైంది. వాన నీటిని ఒడిసిపడితే.. మన భవిష్యత్తు అవసరాలకు సంపదలా నిలుస్తుంది. అందుకు మన చేతుల్లో ఉన్న ఏకైక మార్గం.. ఇంకుడు గుంతల నిర్మాణం. 23 ఏళ్లుగా ఇంకుడు గుంతల నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు ఓ రిటైర్డ్ ఇంజినీర్. ఇప్పటి వరకూ పది వేల ఇంకుడు గుంతల నిర్మాణాల్లో పాలు పంచుకొని.. ఆదర్శంగా నిలుస్తున్నారు.

water harvesting
water harvesting

By

Published : Aug 1, 2021, 4:35 PM IST

హైదరాబాద్ కవాడిగూడకు చెందిన ఆంజనేయులు బీహెచ్​ఈఎల్​ ఇంజినీర్​గా పని చేశారు. రాజస్థాన్​లో నీటి కష్టాలను చూసి చలించిపోయారు. నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్​గా మారటం, వర్షపు నీరు నేరుగా డ్రైనేజీల్లో కలవటం ఆయనను ఆలోచనల్లో పడేశాయి. వాన నీటిని మనం సంరక్షిస్తే.. అదే మన భవిష్యత్తుకు నీటి రిజర్వాయర్‌గా పని కొస్తుందనే భావనను అందరిలోనూ నాటాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా 1998 జులై 31న 5 ఇంకుడు గుంతలతో ఆయన నివాసంలో ఈ పాజెక్టుకు అంకురార్పన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా ఇంకుడుగుంతలు నిర్మించి ఆదర్శంగా నిలిచారు ఆంజనేయులు.

గతేడాది హైదరాబాద్‌లో 1,265 ఇంకుడు గుంతల నిర్మాణానికి ఆంజనేయులు సహకారం అందించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ డివిజన్.. బెర్ముడా అపార్ట్‌మెంట్‌లో 70కి పైగా కుటుంబాలు ఉన్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం వరకు వేసవి వస్తే చాలు.. వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. వేసవి సీజన్ మొత్తం రూ.8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అయ్యేది. ఈ అపార్ట్​మెంట్​లో ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టినప్పటి నుంచి నీటి కోసం అదనపు మెయింటనెన్స్ ఆదా అవుతుందని అపార్ట్​మెంట్‌వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గొప్ప మేలు చేసిన ఆంజనేయులుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏటా ఫలాలు పొందుతున్నాం..

టెర్రస్ మీద వర్షపు నీరు నిల్వ ఉండకుండా.. ఇంకుడుగుంతకు మళ్లించటం, భవన నిర్మాణం, ప్రాంతాన్ని బట్టి ఇంకుడు గుంతలు నిర్మించేలా ఆంజనేయులు తమకు బ్లూ ప్రింట్ ఇచ్చారని.. వాటి ఫలాలు ఏటా పొందుతున్నామని ఆయా ఇంటి ఓనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తా..

ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణంతో మీ ఇంటికే కాదు.. పక్క పోర్షన్లలోనూ నీటి సమస్య తీరిందని చెబుతుండటం సంతోషాన్నిస్తుందని ఆంజనేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23 ఏళ్లుగా ఈ విజ్ఞానాన్ని అందరికీ పంచుతున్నానని.. భవిష్యత్తులోనూ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తానని చెబుతున్నారు.

లబ్ధిదారుల సంతోషం..

కొత్త ఇళ్లు కొనాలన్నా, అద్దె ఇంటికి మారాలన్నా.. ముందుగా వాకబు చేసేది నీటి సమస్య గురించే. నీటి సమస్య ఉన్న ఇళ్లలో చేరేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. దాంతో పాటు ప్రాపర్టీ విలువ సైతం పడిపోతుంది. ఈ ఇంకుడు గుంతల నిర్మాణంతో తమ ఇళ్లకు డిమాండ్ పెరిగిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ఇంకుడు గుంతలు నిర్మిద్దాం.. నీటి సమస్యలు అధిగమిద్దాం

ఎంత వర్షం కురిసినా... వరదలు రావొద్దంటే ఇలా చేయాలి

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పలుగు పట్టిన విశ్రాంత ఉద్యోగి

ABOUT THE AUTHOR

...view details