తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccine: కేంద్రం నుంచి వచ్చిన టీకాలు ఎన్ని? ఇంకా ఎంత అవసరం? - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో ఒకే రోజు రెండు లక్షల మందికి పైగా టీకాలు అందించింది వైద్య ఆరోగ్య శాఖ. అటు ప్రైవేటులోనూ టీకా ప్రక్రియ కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... టీకాల పంపిణీ విషయంలో కేంద్రం నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రాలకు టీకాలు పంపేందుకు పాజిటివిటీ రేట్​తో పాటు.... వేస్టేజీని పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఫలితంగా తెలంగాణకు భవిష్యత్తులో టీకాల కొరత ఏర్పడనుందా ? కేంద్రం నుంచి టీకాలను సరిపడా తెచ్చుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి అన్న అంశాలను ఇప్పుడు చూద్దాం

vaccination
vaccination

By

Published : Jun 12, 2021, 2:32 PM IST

తెలంగాణలో గత వారం పది రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. కేంద్రం నుంచి టీకాలు సకాలంలో అందటంతోపాటు.. ... ప్రైవేటులోనూ టీకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నిత్యం లక్షన్నర మందికి పైగా వ్యాక్సిన్​ని అందిస్తున్నారు. తాజాగా మొదటి, రెండో డోసులు కలిపి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒకే రోజులో 2 లక్షల 9 వేల 374మందికి టీకాలు అందించి రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 200లకి పైగా కేంద్రాల్లో వ్యాక్సిన్​ని అందిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 76లక్షల 8వేల 615 మందికి రాష్ట్రంలో వ్యాక్సిన్ అందించారు. అందులో 69లక్షల 52వేల 180 టీకాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించగా మరో 6 లక్షల 67వేల 970 టీకాలు ప్రైవేటు ఆస్పత్రుల వారు అందించారు. ఇక కొవిన్ ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రానికి 70లక్షల 15వేల 150 డోసుల టీకాలు కేటాయించారు.

ఇప్పటివరకు 70లక్షల టీకాలు

అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో సుమారు 3కోట్ల మందికి పైగా టీకాకి అర్హులు ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున మొత్తం ఆరు కోట్లకు పైగా టీకాలు అవసరం అవుతాయి. ఇప్పటి వరకు వచ్చింది కేవలం 70లక్షలు మాత్రమే. ఇక ఇటీవల కేంద్రం టీకాల కేటాయింపుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి పూర్తిగా ప్రభుత్వంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్రాలకు ప్రాధాన్యతా క్రమంలో టీకాలు అందించనున్నట్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఏ రాష్ట్రాల్లో అయితే అధిక పాజిటివిటీ రేట్ ఉంటుందో వారికి మొదటి ప్రాధాన్యతగా టీకాలు అందించనున్నట్టు ప్రకటించిన కేంద్రం... టీకాలను వృథా చేయకుండా వినియోగించే రాష్ట్రాలకు సైతం ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుతం పాజిటివి రేట్ కేవలం 4.7 శాతంగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో టీకాల వృథా సైతం ఇక్కువగా ఉన్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కేటాయింపుల నూతన మార్గదర్శకాల ప్రకారం తెలంగాణకు టీకాల వాట తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేవలం 0.17శాతం మాత్రమే వృథా

తెలంగాణలో టీకా వృథా అధికంగా ఉందని కేంద్రం చెబుతున్నప్పటికీ వాస్తవానికి రాష్ట్రంలో కేవలం 0.17శాతం మాత్రమే వృథా అయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని డోసుల వివరాలు టెక్నికల్ సమస్యల కారణంగా కొవిన్​లో రిజిస్టర్ కాలేదని వాటిని రిజిస్టర్ చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా టీకా వృథాలోని వ్యత్యాసం తగ్గుతుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి:CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

ABOUT THE AUTHOR

...view details