వినియోగదారులు వారు కొన్న వస్తువుల వల్ల వారికి నష్టం కలిగితే.. ఆ వస్తువులను తయారు చేసిన కంపెనీ లేదా డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ లేదా అమ్మకందారులకు గరిష్ఠంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. లేదా ఒక లక్ష జరిమానా విధిస్తారు. కొత్త చట్టంలో ఈ- కామర్స్ సంస్థలను చేరుస్తూ వినియోగదారుడికి మరో 4 హక్కులను కల్పించారు. నాణ్యతలేని వస్తువుల విషయంలో ఆరు నెలల జైలు శిక్ష విధించే అధికారం జిల్లా వినియోగదారుల కమిషన్లకు ఉంది.
వారం రోజుల్లోనే సమస్యకు పరిష్కారం
సత్వర పరిష్కారానికి మీడియా సెల్‌ను ఏర్పాటు చేసే అధికారం జిల్లా కమిషన్లకు వచ్చింది. వినియోగదారులు, ప్రతివాదులు విచారణకు ముందుగానే సమస్యలను ఇక్కడ పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుంది. మీడియెషన్ సెల్ ద్వారా కేవలం వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించుకోవచ్చు. గడువులోగా పరిష్కారం కాకపోతే యథావిధిగా బెంచ్ విచారణ చేపడుతుంది. ఇందులో తీవ్రత ఉండే కేసులు (వైద్యం, సైబర్, బ్యాంకు మోసాలు) మీడియేషన్ సెల్లో పరిష్కరించుకునే వీలు లేదు. ఈ క్లాజ్‌ను అడ్డుపెట్టుకుని చాలా మంది వినియోగదారుల కమిషన్ పరిధికి తాము రామంటూ ప్రచారం చేసుకుంటున్నారు.