తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్షాబంధన్‌.. ఏ గిఫ్ట్‌ ఇవ్వాలో ఆలోచిస్తే.. ఇది మీకోసమే!!

Raksha bandhan gifts 2022 : సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రాఖీపౌర్ణమి. ప్రేమ అనే రాఖీను చేతికి కట్టి.. ఆప్యాయతానురాగాల తీపిని పంచి.. "నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష" అనే జీవితపు హామీ తీసుకునే పండగే ఈ రక్షాబంధన్​. అంతే కాదు సోదరి సంతోషించేలో గిప్ట్‌ ఇస్తుంటారు. మరి ఈ పండక్కి మీ సోదరికి ఏదైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా... ఏం ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా... అయితే ఈ కథనం మీకోసమే...

special story on Raksha bandhan gifts 2022
special story on Raksha bandhan gifts 2022

By

Published : Aug 11, 2022, 5:35 PM IST

స్మార్ట్‌ ఫోన్.... హెడ్‌ఫోన్స్‌: ఈ పండక్కి మార్కెట్లో సెల్స్‌ ప్రారంభమయ్యాయి. దాంట్లో ఎన్నో ఆఫర్స్... ఈ పండక్కి మీ సోదరికి బడ్జెట్ చూసుకుని స్మార్ట్ ఫోన్‌ లేదా హెడ్‌ ఫోన్స్‌ గిఫ్ట్‌గా ఇవ్వండి. రక్షాబంధన్​ రోజు మీ సోదరికి ఒక మంచి హెడ్‌ఫోన్​ జతను లేదా మంచి స్మార్ట్‌ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చి తనకు ఆనందాన్ని పంచండి. మీ బడ్జెట్‌ను బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌: ఈ రాఖీకి ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. ఆ మొత్తానికి వడ్డీ వస్తోంది. అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌: సోదరి కోసం రక్షా బంధన్‌ రోజున హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. వైద్యపరమైన అత్యవసర సమయాల్లో ఆర్థిక భద్రతను అందిస్తుంది. మెడికల్ బిల్లుల గురించి ఆలోచించకుండా సోదరికి వైద్య చికిత్స పొందడానికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ సహాయపడుతుంది.

బంగారం: బంగారం దీనిని ఇష్టపడని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా... అమ్మాయిలకు బంగారం అంటే చాలా ఇష్టం. రక్షా బంధన్ సందర్భంగా మీరు మీ సోదరికి ఇయర్‌ రింగ్స్, బ్రాస్‌లెట్‌, చైన్స్‌, రింగ్స్‌ లాంటివి గిఫ్ట్‌గా ఇచ్చి... ఆమె ముఖంలో చిరునవ్వును చూడండి. అది వారికి ఎప్పటికీ గుర్తుంటుంది.

స్మార్ట్ వాచ్‌:మీరు మీ లవ్లీ చెల్లికి గాడ్జెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే, మీరు ఆమెకు స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు. అందులో హెల్త్ ట్రాకర్‌తో సహా అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వారు ఈ బహుమతిని చాలా ఇష్టపడతారు. ఇప్పుడు చాలా రకాల స్మార్ట్‌వాచ్‌లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ల్యాప్‌టాప్‌:ప్రస్తుతం రోజుల్లో అందరూ టెక్ లవర్స్‌యే. మీ చెల్లెలికి ల్యాప్‌టాప్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు. అందులోనూ తను ఉద్యోగం చేస్తున్నట్లైతే... వర్క్‌ ఫ్రం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సోదరి చదువుకోవడం లేదా సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడటానికి ఇష్టపడితే, ఆమె ఈ బహుమతిని ఇవ్వొచ్చు.

మొక్కలు: మీ చెల్లెలు ప్రకృతి ప్రేమికురాలు అయితే.... ఓ ఇండోర్ ప్లాంట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి. మీరు ఎలా అయితే సోదరికి తోడుగా, రక్షగా ఉంటారో... మొక్కలు మనకు రక్షణగా ఉంటాయి. వాటిని ఇస్తే... పర్యావరణానికి మేలు చేసినట్లే అవుతుంది.

చాక్లెట్లు: చాక్లెట్లను అందరూ ఇష్టపడతారు. ఈ రక్షా బంధన్ రోజు మీ తోబుట్టువులకు వివిధ రకాల చాక్లెట్లు ఇచ్చి తియ్యటి వేడుక చేసుకోండి.

కొత్త బట్టలు:రక్షా బంధన్ పండుగ సందర్భంగా గిఫ్ట్‌గా ఓ డ్రెస్‌ ఇప్పించండి. ఆన్‌లైన్‌లోనూ ఎన్నో రకాల బట్టలు అందుబాటులో ఉన్నాయి. ఆమె అభిరుచికి తగ్గట్లు కొని ఇస్తే ... ఎంతో సంతోషిస్తారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details