గోల్కొండ కోట రంగు రంగుల దీపాలతో వెలుగులు విరజిమ్ముతోంది. లష్కర్ కొత్త శోభను సంతరించుకుంది. లాల్ దర్వాజ ఎరుపు జాజుతో మరింత కాంతులు చల్లుతోంది. భాగ్యనగరం బోనమెత్తేందుకు ముస్తాబైంది. గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించటంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆషాడమాసం చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ బోనాల్లో ప్రత్యేకమైనవి మాత్రం... గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజల్లో జరిగే బోనాలే. అసలు బోనాలు ఎందుకు నిర్వహిస్తారు. బోనం అంటే అర్థమేంటి... ఇందులో చేసే కార్యక్రమాలేంటి...
బోనాల పండుగకు సిద్ధమైన భాగ్యనగరం - గోల్కొండ బోనాలు
బోనమెత్తేందుకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. రేపు గోల్కొండలో శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ బోనాల పండుగపై ప్రత్యేక కథనం.

bonalu
Last Updated : Jul 3, 2019, 7:57 PM IST