కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎం అండ్ సీటీ) ఏర్పాటైంది. ఈ సంస్థ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)తో కలిసి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అందిస్తోంది. ఇందులో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ -జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ) పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. ఈ స్కోరుతో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న 21 జాతీయ ఐహెచ్‌ఎంలతోపాటు 26 రాష్ట్ర స్థాయి ఐహెచ్‌ఎంలు, ఒక పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, 26 ప్రైవేటు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.
కోర్సు స్వరూపం
బీఎస్‌సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు వ్యవధి మూడేళ్లు. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సును జనరిక్ తోపాటు శాకాహారుల కోసమూ అందిస్తున్నారు. ఇందులో భాగంగా వెజిటేరియన్ కోర్సు ఎంచుకున్నవారికి వెజ్ అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు అందుతుంది. వీరు మాంసాహార వంటలను నేర్చుకోనవసరం లేదు.
ప్రవేశపరీక్ష ఇలా..
పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఎనలిటికల్ ఆప్టిట్యూడ్ 30, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60, సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు మార్కు తగ్గిస్తారు.
ఉపాధి అవకాశాలు
ఐహెచ్ఎంల్లో కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ సంస్థలకు జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, అవసరాలకు అనుగుణంగా అందిస్తోన్న సమగ్ర శిక్షణ ఇందుకు కారణం. ఇక్కడి విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. పూర్తిచేసుకున్న స్పెషలైజేషన్ ప్రకారం... కిచెన్ మేనేజ్‌మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, ఫ్లైట్ కిచెన్స్/ ఆన్‌బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్, వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్/ కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్‌లో ఎగ్జిక్యూటివ్, క్యాటరింగ్ సంస్థలు, షిప్పుల్లో సప్లై, కిచెన్ సెక్షన్ ఉద్యోగాలు; పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, బహుళజాతి కంపెనీల క్యాంటీన్లు, హౌస్ కీపింగ్ నిర్వహణ, హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో ఫ్యాకల్టీ, సొంతంగా ఫుడ్ చెయిన్ ప్రారంభించడం... తదితర అవకాశాలు దక్కుతాయి. లీలా, ఒబేరాయ్, తాజ్, పార్క్, స్టార్ వుడ్, మారియట్...ఇలా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఫుడ్ చైన్ సంస్థలైన కేఎఫ్‌సీ, మెక్ డొనాల్డ్స్, పీజా హట్, డామినోస్..మొదలైనవి ప్రాంగణ నియామకాలు చేసుకుంటున్నాయి. బీఎస్‌సీ తర్వాత రెండేళ్ల వ్యవధితో ఎమ్మెస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసుకోవచ్చు.
గమనించండి!
ఆన్‌లైన్ దరఖాస్తులు: