పదిరోజుల్లోనే స్వస్థత
నాలుగేళ్ల నుంచి తీవ్రమైన కిడ్నీ సమస్య(సీకేడీ)తో బాధపడుతున్నాను. తరచూ నిమ్స్‌కు వెళ్తుంటాను. ఓ రోజు కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ తేలింది. వైరస్ తీవ్రత తక్కువే ఉండటంతో నెఫ్రాలజీ వైద్యుల సూచన మేరకు ఇంటికే పరిమితమయ్యాను. మా కుటుంబంలో మిగతా నలుగురికీ పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. వైద్యులు భరోసా ఇచ్చారు. రోజూ ఉడకబెట్టిన కోడిగుడ్లు.. ఉదయాన్నే అల్లం, పసుపు, మిరియాలను నీళ్లలో వేసి మరిగించిన కషాయం తీసుకునేవారం. తరచూ నిమ్మరసం సరేసరి. విటమిన్ ‘సి’ మాత్రలు వాడాం. రోజూ మూడుసార్లు ఆవిరి పట్టేవారం. కంటినిండా నిద్రపోయాం. నేనైతే పదిరోజుల్లోనే పూర్తిగా కోలుకున్నాను.
- కరోనా బాధితురాలు(58)