నిరుపేద కుటుంబంలో జన్మించి... పుట్టుకతోనే కంటిచూపు లేకపోయినా... నెరవలేదు. చదువుల్లో మేటిగా నిలిచి... సివిల్స్ వైపు అడుగులు వేశారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా నిరాశ చెందలేదు. ప్రయత్నాన్ని ఆపలేదు. రాసిన ప్రతిసారి ఎంపికవుతూ... చివరకు తన లక్ష్యమైన ఐఏఎస్ సాధించారు. ఆయనే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మలికిపురం మారుమూల ప్రాంతం గూడపల్లికి చెందిన కట్టా సింహాచలం ఐఏఎస్.
'ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం... సింహాచలం' - blind IAS
ఏదైనా సాధించాలనే పట్టుదల... మొక్కవోని ఆత్మవిశ్వాసం ఉంటే విజయం ఎదురొచ్చి స్వాగతం పలుకుతుందని నిరూపించారాయన. నలుగురికి దారిచూపే స్థాయికి ఎదిగి... శారీరక లోపం పెద్ద శాపం కానేకాదని రుజువుచేశారు... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గూడపల్లికి చెందిన కట్టా సింహాచలం ఐఏఎస్.
సింహాచలం