లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో అధిక శాతం సిబ్బంది హాజరవడం అభినందనీయమని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని మూల్యాంకన కేంద్రాన్ని చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పరిశీలించారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు అమలవుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు.
'మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన ప్రత్యేక కార్యదర్శి' - telangana Inter Board Secretary Syed Umar Jalil
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
'మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన ప్రత్యేక కార్యదర్శి'
క్లిష్టపరిస్థితుల్లోనూ మూల్యాంకన ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారని సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 15,312 మంది సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నట్లు జలీల్ తెలిపారు. ఈనెల 12 నుంచి జరుగుతున్న మూల్యాంకనం నెలాఖరు వరకు కొనసాగుతుందన్నారు.
ఇదీ చూడండి :13ఏళ్ల క్రితం తప్పిపోయాడు..టిక్‌టాక్‌తో దొరికాడు..