నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కింగ్‌కోఠిలోని జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేంద్రబోయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కొవిడ్ కేసుల వివరాలు, చికిత్స విధానంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆకస్మిక తనిఖీ - హైదరాబాద్ వార్తలు
కింగ్‌కోఠిలోని జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరోనా పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. కొవిడ్ బాధితులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
state health department special secretary, koti hospital
రోగులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి వ్యర్థాలపై ఆరా తీశారు. వాటిని ఏ విధంగా శుభ్రం చేస్తున్నారు అనే విషయాలను అధికారులతో పాటు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి:సీఎం ఎవరో తెలియదు.. రేపే ప్రమాణ స్వీకారం!