అనుదినంబు కాఫీయే అసలు కిక్కు. కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు. కప్పు కాఫీ లభించుటయే గొప్ప లక్కు అని కాఫీ గురించి వర్ణించారు ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల. కాఫీకి ఉన్న గొప్పతనం అలాంటిది. ఇప్పటివరకూ భాగ్యనగరంలో ఇరానీచాయ్, కాఫీడేలోని కాపిచినో, ఇన్స్టెంట్ కాఫీ మాత్రమే చూశారు. తేనీరు ప్రియులు ఉవ్విల్లూరించటానికి అందుబాటులోకి వచ్చింది సరికొత్త టర్కీ కాఫీ. తాగాలంటే టోలీచౌకీ జోర్దాన్ షవార్మా స్టాల్‌కు వెళ్లాల్సిందే.
ఇసుకపై కాస్తారు..
దీర్ఘ చతురస్రాకారపు బాండిలో పూర్తిగా ఇసుక నింపి, వేడి చేస్తారు. పాలు, సౌదీ నుంచి తీసుకొచ్చిన కాఫీ పొడి, పంచదారను సులువుగా పట్టుకునేందుకు వీలుగా ఉన్న రెండు రాగి పాత్రల్లో వేసి ఇసుకపై పెడతారు. ఇలా చేస్తేనే ప్రత్యేక రుచి వస్తుందంటున్నారు దుకాణదారుడు.