సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శిశువుకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది, చేనేత విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణాలను సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా ప్రారంభించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పాలిచ్చేందుకు ప్రత్యేక గది - hyderabad updates
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శిశువుకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది, చేనేత విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్, దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణాలను సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా ప్రారంభించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శిశువుకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది
ప్లాట్‌ఫామ్ నెం.10 వద్ద శిశువుకు పాలు ఇచ్చే ప్రత్యేక గదిని, ప్లాట్‌ఫామ్ నెం.1 వద్ద పోచంపల్లి చేనేత విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్.వి.హనుమంత రావు, రోటరీ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.