తెలంగాణ

telangana

ETV Bharat / state

Diwali Festival: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు - Bhagyalakshmi Temple Latest News

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. దీపావళి పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గవర్నర్‌ తమిళిసై (governor Tamilsai Soundarajan)తో పాటు భాజపా, తెరాస నేతలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Special pujas of celebrities at Bhagya Lakshmi Temple, Hyderabad
Diwali Festival: భర్తతో కలసి గవర్నర్​ తమిళిసై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

By

Published : Nov 4, 2021, 2:15 PM IST

Updated : Nov 4, 2021, 2:49 PM IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (governor Tamilsai Soundarajan)కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని (bhagyalaxmi temple news) దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు పండితులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. తమిళిసై దంపతులు భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదాశీర్వచనం అందించిన పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రముఖుల ప్రత్యేక పూజలు

చెడుపై మంచి విజయం

రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ చెడుపై మంచి విజయం సాధిస్తుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న లక్ష్మణ్‌.. అందరి జీవితాల్లో దీపావళి వేళ.. వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ దివ్వెల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

భక్తుల రద్దీతో కళకళ

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని వేడుకున్నానని తెరాస నేత ఎల్.రమణ తెలిపారు. కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మి దేవాలయన్ని దర్శించుకున్న రమణకు ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. దీపావళి వేళ.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో కళకళలాడింది. స్థానికులు, నగరవాసులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:Naga shourya farmhouse case: ఫాంహౌస్‌ పేకాట కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Last Updated : Nov 4, 2021, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details