PAWAN IN VIJAYAWADA : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన అంతం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ్టి నుంచి రాక్షస పాలనను అంతం చేయడమే లక్ష్యంగా వారాహి ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. దుర్గమ్మ ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి వచ్చినట్లు పవన్ తెలిపారు. తొలుత తెలంగాణలోని కొండగట్టులో వారాహికి పూజలు నిర్వహించినట్లు చెప్పారు.
ఏపీలోని విజయవాడ దివ్య క్షేత్రం కాబట్టి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని పవన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ముందుకు సాగాలని అభిలాషించారు. ఆలయానికి వచ్చిన పవన్‌కు జనసేన నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.