భాగ్యనగరంలో కంటైన్మెంట్ జోన్లలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఖైరతాబాద్‌లోని కంటైన్మెంట్ ప్రాంతాలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ జోన్లలో జనసంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. బారికేడ్లను ఏర్పాటు చేసి రోడ్లను మూసేశారు. పారిశుద్ధ్యంపై మరింత దృష్టి సారించారు.
కంటైన్మెంట్ జోన్లలో నిఘా పటిష్ఠం - కంటైన్మెంట్ భద్రత అధికారులు
హైదరాబాద్‌లోని కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా అధికారులు తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఏరియాల్లో జన సంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు.

కంటైన్మెంట్
ఖైరతాబాద్‌లోని కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ఇంటికే అందిస్తున్నట్లు స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి వైద్యారోగ్య శాఖ బృందాలు ప్రతి ఇంటిని తనిఖీ చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయన్నారు. క్రమం తప్పకుండా క్రిమి సంహారక ద్రావణాలను పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీసులు తెలిపారు. అనవసరంగా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు