మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్లోని శ్రీశ్రీ ఉమా నాగలింగేశ్వేర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తుల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మన్సూరాబాద్‌లో శివాలయంలో వైభవంగా కల్యాణోత్సవం - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్‌లోని శ్రీశ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకొని స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి సుమారు 2000 మందికి అన్నదానం చేశారు.
శ్రీశ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు