తెలంగాణ

telangana

ETV Bharat / state

Passport: ఏప్రిల్‌ 29 నుంచి హైదరాబాద్‌లో స్పెషల్‌ పాస్‌పోర్ట్‌ డ్రైవ్‌

Special Passport Drive in Hyderabad: హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 29 నుంచి స్పెషల్‌ పాస్‌పోర్ట్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు పాస్​పోర్ట్ సేవా కార్యక్రమ విభాగం తెలిపింది. పెండింగ్‌ పాస్‌పోర్ట్‌లకు ఈనెల 29 నుంచి స్లాట్‌ బుకింగ్‌లు ఉంటాయని పేర్కొంది. తత్కాల్‌, సాధారణ, పీసీసీ పాస్‌పోర్ట్‌లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

Passport
Passport

By

Published : Apr 26, 2023, 7:03 PM IST

Special Passport Drive in Hyderabad: ఏప్రిల్‌ 29 నుంచి హైదరాబాద్​లో స్పెషల్‌ పాస్​పోర్టు డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం విభాగం ప్రకటించింది. భాగ్యనగరంతో పాటు కరీంనగర్‌, నిజామాబాద్‌లలో కూడా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈనెల 29 నుంచి నిర్వహించనున్న స్పెషల్‌ డ్రైవ్‌కు సంబంధించి అపాయింట్​మెంట్లు గురువారం 27వ తేది నుంచి విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఆ పాస్​పోర్ట్​లు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత: అపాయింట్​మెంట్లు దొరకక పెండింగ్‌లో ఉన్న పాస్‌పోర్ట్​లకు ఈ నెల 29 నుంచి స్లాట్‌ బుకింగ్‌లకు ఏర్పాటు చేస్తున్నట్లు పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం విభాగం తెలిపింది. తత్కాల్‌, నార్మల్‌, పీసీసీ పాస్‌పోర్ట్‌లకు స్పెషల్‌ డ్రైవ్‌లో మెుదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. తత్కాల్‌, సాధారణ... అన్ని కేటగిరిలలో ఉన్న 3 వేల 56 అపాయింట్​మెంట్​లకు సంబంధించి స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు www.passportindia.gov.in వెబ్‌సైట్​ను సంప్రదించవచ్చని ప్రకటించింది. ఏప్రిల్‌ 29 నుంచి నగరంలో చేపట్టనున్నస్పెషల్‌ పాస్​పోర్ట్​ డ్రైవ్​ కోసం పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం విభాగం తగిన ఏర్పాట్లను చేస్తుంది.

పాస్‌పోర్ట్‌ జాబితాను విడుదల చేసిన హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ సంస్థ: మీరు ప్రపంచయాత్ర చేయాలని అనుకుంటున్నారా? వీసా అనుమతుల కోసం వేచి చూడాల్సిన అవసరంలేదు. మీకు భారత్‌ పాస్‌పోర్ట్ ఉంటే చాలు. ప్రపంచంలోని 59 దేశాల్లో వీసా లేకుండా లేదా వీసా ఆన్‌ అరైవల్‌తో పర్యటించవచ్చు. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ 2023లో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది.

ఆ జాబితాలో 85వ స్థానంలో భారత్​:ఈ జాబితాలో భారత్‌ 85వ స్థానంలో నిలిచింది. గతేడాది ఈ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 83వ స్థానంలో ఉండటం గమనార్హం. 2022లో 60 దేశాల్లో పర్యటించేందుకు వీలుండగా, ఈ ఏడాది 59 దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. గతేడాది భారత్‌ పాస్‌పోర్ట్‌ ఉన్నవారి వీసా లేకుండా పర్యటించేందుకు అనుమతించిన సెర్బియా, ఈ ఏడాది ఆ నిబంధనను తొలగించింది. హోన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం 2006లో భారత్‌ 71వ స్థానంలో ఉండగా, 2023 నాటికి 85వ స్థానంలో ఉండటం గమనార్హం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details