సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ ప్రాంగణంలోని ప్రాసెసింగ్ కౌంటర్ ఈనెల 28వ తేదీ వరకు పనిచేస్తుందని ఆర్పీవో దాసరి బాలయ్య వెల్లడించారు. విదేశాలకు అత్యవసర ప్రయాణాలు చేయదలచిన వారి కోసం ఈ ప్రత్యేక కౌంటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈనెల 28 వరకు ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్ సేవలు
ఈనెల 28 వరకు సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు ప్రత్యేక కౌంటర్ పనిచేస్తుందని ఆర్పీవో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఈనెల 28 వరకు ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్ సేవలు
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉండడం వల్ల ఇప్పటికే అన్ని సేవా కేంద్రాలు పాస్‌పోర్టుల జారీ ప్రక్రియను నిలిపివేసినట్లు గుర్తుచేశారు.
ఇవీచూడండి:రోగ నిరోధక శక్తి బాగుంటే బ్లాక్ ఫంగస్ రాదు: డాక్టర్ శంకర్ ప్రసాద్