ఏపీలోని గుంటూరు జిల్లా అత్తోటకు చెందిన 76 ఏళ్ల రోశయ్యకు వ్యవసాయమే జీవనాధారం. గతంలో వరి పండించే ఆయన.. వ్యవసాయ శిక్షణ తరగతుల తర్వాత సమీకృత సాగు వైపు మళ్లారు. తనకున్న 75 సెంట్ల పొలంలో వివిధ రకాలు పండిస్తున్నారు. మన ప్రాంతంలో పండని వాటిని సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
ముందుగా తన పొలం చుట్టూ కొబ్బరి మొక్కలు నాటారు. మధ్యలో నిమ్మ, నారింజ, వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరల సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా పశువుల వ్యర్థాలనే పంటకు ఉపయోగిస్తారు. ఉసిరి, నేరేడు, దానిమ్మ, మామిడి, సపోట, సీతాఫలం, పైనాపిల్, రామఫలం వంటి పండ్ల చెట్లు ఇక్కడ కనిపిస్తాయి.