తెలంగాణ

telangana

ETV Bharat / state

తానేంటో నిరూపించుకోవాలనుకుంది.. సహకారం లేకున్నా సాధించి చూపించింది.. - skincare influencer lasya chittella

skincare influencer lasya chittella interview: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తామెంటో నిరూపించుకోవాలని చాలా మంది అనుకుంటారు.. కానీ ఎంతమంది తమ కలలను సాకారం చేసుకుంటున్నారంటే ప్రశ్నార్థకమే. ఈ యువతి అందుకు భిన్నంగా నిలుస్తోంది. బ్యూటీ ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా ఎదగాలనుకున్న తన లక్ష్యానికి కుటుంబసభ్యుల సహకారం లేకపోయినా ముందడుగు వేసింది. ఫలితంగా దక్షిణ భారతదేశంలోని అతికొద్ది బ్యూటీ ఇన్‌ఫ్ల్యూయెన్సర్లలో ఒకరుగా నిలిచింది హైదరాబాద్‌కు చెందిన లాస్యా చిటెల్ల. లా.. చదివిన ఈ యువతి ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా ఎదిగి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పెద్ద పెద్ద స్కిన్‌ కేర్ అంశాలను తెలియజేస్తున్న యువతి.. వేలాది మంది అభిమానుల ఆదరణను సొంతం చేసుకుంది.

'తానేంటో నిరూపించుకోవాలనుకుంది.. సహకారం లేకున్నా సాధించి చూపించింది'
'తానేంటో నిరూపించుకోవాలనుకుంది.. సహకారం లేకున్నా సాధించి చూపించింది'

By

Published : Sep 14, 2022, 5:23 PM IST

'తానేంటో నిరూపించుకోవాలనుకుంది.. సహకారం లేకున్నా సాధించి చూపించింది'

skincare influencer lasya chittella interview: ఆమె.. లా చదువుకుని ఇన్‌ప్లూయెన్సర్‌గా మారింది. నానాటికీ పెరుగుతున్న డిజిటల్‌ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ఇంట్లో వారెవరూ మెుదట్లో మద్దతు ఇవ్వకపోయినప్పటికీ ముందుకు సాగి తానేంటో నిరూపించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటీ ఇన్‌ప్లూయెన్సర్‌గా రాణిస్తోంది. 25 వేల మంది ఫాలోవర్స్‌తో బ్యూటీ, స్కిన్‌ కేర్‌ రంగంలో ముందుకెళ్తోంది. ఆమే లాస్యా చిటెల్ల. బ్యూటీ, స్కిన్‌ కేర్‌ విభాగంలో దక్షిణ భారతదేశంలో ఉన్న అతి తక్కువ మంది ఇన్‌ప్లూయెన్సర్‌లలో లాస్యా కూడా ఒకరు. కామా ఆయుర్వేద, ప్లమ్‌, ఇన్నిస్‌ ఫ్రీ వంటి పెద్ద పెద్ద స్కిన్‌ కేర్‌ బ్రాండ్స్‌తో సహకరిస్తూ దూసుకెళ్తూ తన ఉనికిని చాటుతోంది. చిన్న వయసులో ఎంతో మంది ఆదరణ పొందుతూ తన కాళ్ల మీద తాను నిలబడుతూ నేటి తరం అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం ఎంతో అవసరం అని చాటి చెప్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ లాస్యా చిటెల్లతో ఈటీవీ భారత్‌ ప్రత్యేక ముఖాముఖి..

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details