ముఖ్బీర్ అలాంటి వెబ్ సిరీస్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రంగమార్తాండ: ప్రకాశ్‌రాజ్ - Mukbir web series
Prakash Raj Interview: ఒక సామాన్య వ్యక్తి గూఢాచారిగా మారి దేశాన్ని ఎలా రక్షించాడనే కథాంశంతో బాలీవుడ్‌లో నిర్మించిన వెబ్ సిరీస్ ముఖ్బీర్. 1960లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. శివమ్ నాయర్, జయప్రద్ దేశాయ్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ వచ్చే నెల 11న హిందీ, తెలుగు, పంజాబీ, తమిళంలో జీ5 ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ముక్బీర్‌లో గూఢాచారులను తయారు చేసే అధికారి మూర్తి పాత్రలో నటించిన ప్రకాశ్‌రాజ్ ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశం కోసం తమలో తామే అంతర్యుద్ధం చేసిన ఎంతో మంది వ్యక్తులున్నారని, వారి హీరోయిజాన్ని చాటిచెప్పే మంచి సిరీస్ ముఖ్బీర్ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. అలాగే తాను కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన రంగమార్తాండ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటోన్న ప్రకాశ్‌రాజ్‌తో మా ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ..
Prakashraj