తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి!

రాష్ట్రంలో కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవసరమైన మేరకు సిబ్బందిని తీసుకుంటామని మంత్రి ఈటల తెలిపారు. అనుమానిత రోగులను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని ప్రైవేటు ఆసుపత్రులను కోరారు.

special  hospital to treat corona identifies in telangana state
కరోనా అనుమానితుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి!

By

Published : Mar 3, 2020, 1:58 PM IST

కరోనా అనుమానితుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి!

కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖర్చుకు వెనకాడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు.

తొమ్మిది శాఖలు సమన్వయంతో పనిచేయాలని... ప్రతి శాఖలోనూ ప్రత్యేకంగా నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైన మేరకు ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని... అనుమానిత రోగులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని కోరినట్లు చెప్పారు.

ఇవీ చూడండి:"నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారం లేదు"

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details