తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సోకిన రైల్వే ఉద్యోగుల చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రి - Preparations for the treatment of railway employees affected by corona

కరోనా చికిత్సలకు లాలాగూడాలోని సెంట్రల్​ హాస్పిటల్​కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కొవిడ్​ బారిన పడిన రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ ఆస్పత్రిలో చికిత్సలు అందించనున్నారు.

Special hospital to railway employees infected with corona virus
కరోనా సోకిన రైల్వే ఉద్యోగుల చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రి

By

Published : Jun 28, 2020, 4:50 AM IST

కరోనా సోకిన రైల్వే ఉద్యోగులకు చికిత్స అందించేందుకు లాలాగూడలోని సెంట్రల్ హాస్పిటల్​కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వచ్చే వారం నుంచి కరోనా బారిన పడిన రైల్వే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు చికిత్స అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రెండు, మూడు రోజుల్లో కొన్ని మరమ్మతులు పరికరాలు వచ్చిన అనంతరం చికిత్స ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వైద్య, పారామెడికల్ సిబ్బందికి రెండు వారాల పాటు విధుల్లో, మరో రెండు వారాలు క్వారంటైన్​లో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కొవిడ్ బారిన పడిన ఉద్యోగులకు సమతుల ఆహారం, నిత్యం శానిటేషన్ చేసే ప్రక్రియను కూడా చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ తదవండి:పారాసిటమాల్​ వేసుకుంటే చాలన్నారు: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details