తెలంగాణ

telangana

ETV Bharat / state

'వృద్ధుల కోసం ప్రత్యేక హెల్ప్​డెస్క్​లు ఏర్పాటు చేయాలి' - add cp

పోలీసు శాఖ సహకారంతో హెల్ప్ ఏజ్ ఇండియా వృద్ధుల సహాయ కేంద్రాన్ని హైదరాబాద్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దీని వల్ల  ఎంతో మంది వృద్ధులకు సాంత్వన చేకూరిందని నగర అదనపు పోలీస్​ కమిషనర్ శిఖా గోయల్ తెలిపారు.

'వృద్ధుల కోసం ప్రత్యేక హెల్ప్​డెస్క్​లు ఏర్పాటు చేయాలి'

By

Published : Jun 14, 2019, 10:05 PM IST

హెల్ప్ ఏజ్ ఇండియా ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన ప్రపంచ వృద్ధుల వేధింపులు నివారణ అవగాహన దినోత్సవంలో నగర అదనపు పోలీస్​ కమిషనర్​ శిఖాగోయల్​ పాల్గొన్నారు. హెల్ప్ ఏజ్ ఇండియా సహకారంతో పోలీస్​శాఖ వయో వృద్ధుల సంఘాలను కలిసి వారి సమస్యల పరిష్కారానికి ఓ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి పోలీస్ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. పట్టణ ప్రాంత వృద్ధుల కన్నా గ్రామీణ ప్రాంత వృద్ధుల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం 2007 ప్రకారంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ నిర్వహణలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. లీగల్ సర్వీసు ప్రభుత్వ అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవిన్యూ కార్యాలయాల్లోను వృద్ధుల కోసం ప్రత్యేక "హెల్ప్ డెస్క్" లను ఏర్పాటు చేయాలన్నారు.

'వృద్ధుల కోసం ప్రత్యేక హెల్ప్​డెస్క్​లు ఏర్పాటు చేయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details