బక్రీద్ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో యాటల వ్యాపారం జోరుగా సాగుతోంది. సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్లో మేకలు, పొట్టేళ్ల అమ్మేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొవచ్చిన వివిధ జాతులకు చెందిన పొట్టేళ్లు అందర్నీ అబ్బురపరుస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నందున ప్రత్యేక జాగ్రత్తలతో అమ్మకాలు జరుపుతున్నారు.
భాగ్యనగంలో జోరుగా సాగుతోన్న పొట్టేళ్ల వ్యాపారం - special goats stalls at chilkalguda municipal ground
బక్రీద్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరంలో మేకలు, పొట్టేళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్లో వివిధ రకాల యాటలను అమ్మేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు.

భాగ్యనగంలో జోరుగా సాగుతోన్న పొట్టేళ్ల వ్యాపారం
స్టాల్స్ వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవాలని వ్యాపారస్తులు, వినియోగదారులకు నార్త్‌జోన్ మున్సిపల్ ఉప కమిషనర్ మోహన్‌రెడ్డి సూచించారు. విధిగా మాస్కు ధరించాలని, ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ... క్రయ విక్రయాలు జరపాలన్నారు. కొవిడ్ జాగ్రత్తల నడుమ బక్రీద్ వేడుకలు జరుపుకోవాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.