సికింద్రాబాద్లోని చిలకలగూడ మున్సిపల్ మైదానంలో అఖిషా పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని అంగరంగవైభవంగా రంగురంగుల అలంకరణలతో చిలకలగూడ వీధుల మీదుగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా లంబాడీల నృత్యాలు, కేరళ వాయిద్యాలు, బ్రాహ్మణుల మేళతాళాలు, బతుకమ్మ కోలాటాలు, మహారాష్ట్ర వాయిద్యాల మధ్య కోలాహలంగా శోభాయాత్ర జరిగింది. కనుల పండువగా రంగురంగుల దీపాల కాంతులతో గణనాథుడు గంగమ్మ ఒడికి బయలుదేరాడు.
కన్నుల పండవగా గణనాథుని శోభయాత్ర - special ganesh nimajjanam
గణేష్ నవరాత్రులు ముగింపు సందర్భంగా గణనాథులు సాగర తీరానికి బయలుదేరాడు. తొమ్మిది రోజుల పాటు వేదమంత్రాలతో పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. సికింద్రాబాద్లోని చిలకలగూడలో గజాననుడి శోభయాత్ర కనులపండువగా జరిగింది.
![కన్నుల పండవగా గణనాథుని శోభయాత్ర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4411629-171-4411629-1568251147296.jpg)
కన్నుల పండవగా గణనాథుని శోభయాత్ర