రాబోయే కొద్ది రోజుల్లోనే కంటోన్మెంట్ అభివృద్ధి చేసి చూపిస్తానని నూతన ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. కంటోన్మెంట్ కార్యాలయం నుంచి బోయిన్పల్లి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
కంటోన్మెంట్ అభివృద్ధికి అహర్నిశలు కృషి : మహేశ్వర్రెడ్డి - కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తామన్న నూతన ఉపాధ్యక్షుడు
సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. తనకు అవకాశమిచ్చిన బోర్డు సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే సాయన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
కంటోన్మెంట్ అభివృద్ధికి అహర్నిశలు కృషి : మహేశ్వర్రెడ్డి
తనకున్న 45 రోజుల్లోనే రూ.34 కోట్ల రూపాయల నిధులు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి రావల్సిన బకాయిలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పాటుపడతానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ఎమ్మెల్యే సాయన్న ప్రకటించారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.