సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్స్టేషన్లో సైబర్ క్రైమ్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అల్వాల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.
'ప్రతి పోలీస్స్టేషన్లో సైబర్ క్రైం ప్రత్యేక విభాగం' - ప్రతి పోలీస్స్టేషన్లో సైబర్ క్రైం ప్రత్యేక విభాగం'
ప్రతి పోలీస్స్టేషన్లో సైబర్ క్రైమ్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అల్వాల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. సైబర్ నేరాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
సైబర్ నేరాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సైబర్ కేటుగాళ్లకు కళ్లెం వేసే.. విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ఎవరైనా సైబర్ నేరాల గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. డబ్బులు అడగడం, నకిలీ మాట్రిమోని ద్వారా డబ్బులు తీసుకోవడం... తక్కువ ధరకే ద్విచక్రవాహనాలు లభిస్తాయని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ.. ఉన్న అకౌంట్లో డబ్బులు దొంగలించడం ఇలాంటివి అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయని వివరించారు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.