ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 16న ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారికి ఈనెల 17న ప్రత్యేక విడత పరిశీలన ఉంటుంది.
ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ - ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్
ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 21న ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్
ఈనెల16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 21న ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. సీటు దక్కిన విద్యార్థులు ఈనెల 24లోగా కాలేజీల్లో చేరాలి. ఈనెల 21న ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు