హైదరాబాద్‌లో వ్యర్థాల నిర్వహణ, ప్రాసెసింగ్‌పై ఉత్తమ విధానాల అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య ప్రత్యేకాధికారి సుజాతా గుప్తా మెంబర్ కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖీ, ఐపీఎస్ విశ్వజిత్ కంపాటి ఇతర అధికారులు ఉన్నారు. ఈ కమిటి ఇండోర్, మైసూర్, సూరత్‌లో పర్యటించి ఉత్తమ విధానాలను అధ్యయనం చేయనుంది. రోడ్ మ్యాప్ కోసం ఈ నెల 25 లోపు నివేదిక, ప్రజంటేషన్ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
'వ్యర్థాల నిర్వహణ అధ్యయనానికి ప్రత్యేక కమిటీ' - జీహెచ్ఎంసీ
హైదరాబాద్‌లో వ్యర్థాల నిర్వహణ, ప్రాసెసింగ్‌పై ఉత్తమ విధానాల అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
!['వ్యర్థాల నిర్వహణ అధ్యయనానికి ప్రత్యేక కమిటీ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4673156-320-4673156-1570377839237.jpg)
'వ్యర్థాల నిర్వహణ అధ్యయనానికి ప్రత్యేక కమిటీ'